Thursday, April 5, 2012

4) రంగని సేవింప గలిగెనమ్మ

రాగం : రేగుప్తి(మోహన) తాళం : ఆది


రంగని సేవింప గలిగెనమ్మ
మా రంగని సేవింప గలిగెనమ్మా
వయ్యారి మోహన రంగని సేవింప గలిగెనమ్మ

అంగనలిరువురూ, రంగుగ పదములు
పొంగుచునొత్త భుజంగ శయనుడగు

తీరుగ నుభయ కావేరి మధ్యమున
మీరుచు ప్రణవా కారుడైనా శ్రీ

నాభి కమలముల నవినజు నిడుకొని
స్వాభి మానమున జగముల నేలెడు

ఉరమునందు సిరి మెరయుచండగను
శరణను భక్తుల కనుగొనుచుండెడు

చారు సప్త ప్రాకార సువర్ణ హ
జారమునందు విహారకుడై శ్రీ

దోరి తూము నరసింహదాసుదాసునకు
గూరిమితో భవతారకుడైన శ్రీ

Monday, April 2, 2012

3) కనులకు కనిపించవేమి?

కనులకు కనిపించవేమి? ఇంత
కన్నడ సేయుటకు కారణమేమి?

గుహుడు కడిగిన పాదమేది? రామ
జనకు కూతురు గూర్చున్న వామాంకమేది

చిలుకపువ్వుల శాలువేది రామ?
తళుకుమించిన నీకర్ణముల కుండలములేవి?

ఎక్కడనున్నావు స్వమీ? మాకు
దిక్కెవరయ్య ఓ అంతర్యామి?

భరతుడిచ్చిన పతకమేది? రామ
తూము నరసింహదాసుడొత్తిన పాదమేది?

Saturday, March 31, 2012

దాశరథితోడ సరిదైవమేదే

దాశరథితోడ సరిదైవమేదే మన
దాశరథితోడ సరిదైవమేదే

దాసులను బ్రోవ తలిదండ్రి క్రియ నొపు మన
దాశరథితోడ సరిదైవమేదే మన

గాసిపడి వేడినను డాసి కడతేర్చుటకు
వాసికలిగున్న రవివంశ భవుడైన మన

మీరి కాకాసురుడు చేరి అపరాధినని
కోరి శరణన్నం గడతేర్చిన

వారినిధి గర్వమొకసారి బాణంబునను
చూరబుచ్చిన దయావారిధియగు మన

వింతగను వార్ధినొక గంతున దాటిని
హనుమంతునేలిన బలవంతుడైనట్టి మన

రావణుని తమ్ముండొగి కావుమని వేడినను
పావనుని చేసినట్టి సంభావ్యుడైన మన

కూరిమితొ భద్రగిరి చేరి నరసింహులను
వారకను బ్రోచు రఘువీరుడైనట్టి మన

Thursday, March 29, 2012

1) సెలవా మాకు సెలవా

తూము నరసింహ దాసు గారి కృతులన్ని నెట్లో ఒకచోట పెట్టాలని ప్రయత్నం. (వీలైనంత వరకు ఆరంభ శూరత్వం కాకుండ చూస్తాను. మీకేదైనా సమాచారం తెలిస్తే, లేదా ఓ చేయి వేయగలిగితే కామెంట్లో సంప్రదింపు వివరాలు చెప్పండి..



1) సెలవా మాకు సెలవా
=============

సెలవా మాకు సెలవా
సెలవా మాకిక జలజ సంభవ మతి
జలధర గాత్ర సజ్జన ముని స్తోత్ర

సుందర వదన సుందరలోల
నందనందన గోవింద సదానంద

వనజాతనేత్ర పావననామ రిపుభయ
ఘనగచేల వరద వైకుంఠ పుర వాస

బుధజన వందిత పూజిత పదపద్మ
మధుసూదనానంద మంధర జలధర

దుర్మదాంతక భక్తనిర్మలలోల
ధర్మసేవిత రామ దాస విలాస

నగరాజోద్భవనుత నగవైరి సన్నుత
నిగమసేవిత భక్త నరసింహపూజిత